: లాంచీలో చంద్రబాబు... రాజమండ్రిలో పుష్కర ఘాట్లను పరిశీలిస్తున్న వైనం


ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు లాంచీ ఎక్కారు. గోదావరి పుష్కరాల నేపథ్యంలో రాజమండ్రిలో తిష్ట వేసిన చంద్రబాబు పుష్కర ఘాట్ల వద్ద రద్దీ, ఘాట్లకు తరలివస్తున్న భక్తులతో రహదారులపై ఏర్పడుతున్న ట్రాఫిక్ జామ్ లపై ఎప్పటికప్పుడు స్పందించడమే కాక సంబంధిత శాఖలకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఒకానొక సందర్భంలో రాజమండ్రిలోని కంట్రోల్ రూంలో కూర్చున్న ఆయన సీసీ టీవీ ఫుటేజీలను కూడా పరిశీలించారు. రేపటితో పుష్కరాలు ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో నేటి ఉదయం నుంచి పుష్కర ఘాట్లకు భక్తులు పోటెత్తారు. దీంతో పుష్కర ఘాట్లలో రద్దీపై ఓ కన్నేసేందుకు చంద్రబాబు ఏకంగా లాంచీ ఎక్కేశారు. మంత్రులు నారాయణ, దేవినేని, తదితరులు ఆయనతో లాంచీలో ఉన్నారు.

  • Loading...

More Telugu News