: పుష్కరాల్లో విధులు నిర్వహించిన ఉద్యోగులకు సెలవులు ప్రకటించిన కేసీఆర్


గోదావరి పుష్కరాల్లో విధులు నిర్వహించిన తెలంగాణ ఉద్యోగులకు సీఎం కేసీఆర్ సెలవులు ప్రకటించారు. ఈనెల 14 నుంచి 25వరకు పుష్కరాలు జరుగుతున్నాయి. అంటే రేపటితో పుష్కరాలు ముగియనున్నాయి. ఆ వెంటనే అంటే 27, 28 తేదీల్లో ఉద్యోగులకు సెలవు ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత తొలిసారి వచ్చిన గోదావరి పుష్కరాల్లో భక్తులకు ఎలాంటి ప్రమాదాలు, ఇబ్బందులు కలగకుండా చూసినందుకు ఉద్యోగులందరికీ సీఎం కృతజ్ఞతలు తెలిపారు.

  • Loading...

More Telugu News