: కువైట్ లో పెరుగుతున్న భారతీయుల డ్రగ్స్ కేసులు


డ్రగ్స్ అక్రమ రవాణా చేస్తున్న భారతీయుల సంఖ్య క్రమేపీ పెరుగుతోంది. గల్ఫ్ దేశం కువైట్ లో కూడా ఇదే విషయం ఆందోళన కలిగిస్తోంది. కువైట్ సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్న వారిలో 60 శాతం మందికి పైగా భారతీయులు డ్రగ్స్ అక్రమ రవాణా కేసులో పట్టుబడిన వారే. కువైట్ లో డ్రగ్స్ సరఫరా చేసే వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించరు. శిక్షలు కఠినంగా ఉంటాయి. మరణశిక్షలు కూడా విధిస్తారు. ఇలాంటి కేసుల్లో ఇరుక్కున్న వారి విషయంలో దౌత్య కార్యాలయాలు కూడా జోక్యం చేసుకోలేవు. ఇటువంటి పరిస్థితుల్లో కువైట్ జైళ్లలో మగ్గుతున్న భారతీయుల పరిస్థితి అగమ్యగోచరమే.

  • Loading...

More Telugu News