: ఇండియా బాగుందంటున్న 74 శాతం మంది!


పదేళ్ల క్రితం భారత్ లో నెలకొన్న పరిస్థితులతో పోలిస్తే, ప్రస్తుతం ఇండియా బాగుందని నాలుగింట మూడొంతుల మంది అభిప్రాయపడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక కష్టాల నుంచి రికవరీపై సందేహాలు నెలకొన్నా, ఇండియా ఆర్థిక పరంగా సత్ఫలితాలు చూపుతోందని 'ప్యూ రీసెర్చ్' విడుదల చేసిన అధ్యయనం వెల్లడించింది. గత సంవత్సరంతో పోలిస్తే ఇండియా బాగుందని చెప్పినవారి సంఖ్య 10 శాతం పెరిగిందని తెలిపింది. 21 అభివృద్ధి చెందుతున్న దేశాల్లో 14 దేశాల ఆర్థిక వ్యవస్థలు వ్యతిరేక దిశగా సాగుతున్నాయని కూడా అధ్యయన నివేదిక పేర్కొంది. తమ దేశం అత్యంత అద్భుత పనితీరు చూపుతోందని అభిప్రాయపడ్డ వారిలో ఉక్రెయిన్ వాసులు (94 శాతం), లెబనాన్ ప్రజలు (89 శాతం), బ్రెజిలియన్స్ (87 శాతం) నిలిచారని వివరించింది. 2015లో తమతమ దేశాల్లో ఎకనామిక్ కండిషన్స్ తృప్తికరంగా ఉన్నాయని 90 శాతం మంది చైనీయులు, 86 శాతం మంది వియత్నాం వాసులు, 74 శాతం మంది భారతీయులు అభిప్రాయపడ్డారని 'ప్యూ రీసెర్చ్' తెలిపింది. అభివృద్ధి చెందిన దేశాల్లో 40 శాతం, అభివృద్ధి దిశగా దూసుకెళ్తున్న దేశాల్లో 45 శాతం, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో 46 శాతం మంది తమ దేశాల పనితీరుపై తృప్తిని వ్యక్తం చేశారని వెల్లడించింది.

  • Loading...

More Telugu News