: యాకూబ్ ను ఎలా ఉరి తీస్తారు?... అసదుద్దీన్ ఒవైసీ వివాదాస్పద వ్యాఖ్య
ముంబై బాంబు పేలుళ్ల దోషి యాకూబ్ మెమన్ ఉరిశిక్షపై మజ్లిస్ అధినేత, హైదరాబాదు ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. యాకూబ్ ను ఎలా ఉరి తీస్తారంటూ ప్రశ్నించి ఒవైసీ పెద్ద చర్చకే తెరతీశారు. ముంబై పేలుళ్ల నేరస్తులకు యాకూబ్ మెమన్ ప్రత్యక్షంగా సహకరించడమే కాక వారు ప్రయాణించేందుకు తమ సొంత కార్లను కూడా ఏర్పాటు చేశాడు. విచారణలో భాగంగా యాకూబ్ దోషేనని తేలింది. దీంతోనే అతడికి ఉరిశిక్ష విధిస్తూ టాడా కోర్టు తీర్పు చెప్పింది. కింది కోర్టు శిక్షను సుప్రీంకోర్టు కూడా సమర్థించింది. ఈ నెల 30న యాకూబ్ కు ఉరిశిక్ష అమలు కానుంది. ఇంతటి కీలక సమయంలో నేటి ఉదయం ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా అసదుద్దీన్ ఒవైసీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.