: ప్రచార ఆర్భాటం కోసం చంద్రబాబు ఆరాటపడుతున్నారు: దిగ్విజయ్
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అనంతపురం జిల్లా పర్యటనను వ్యతిరేకించిన టీడీపీ, సీఎం చంద్రబాబుపై ఆ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అసలు రాహుల్ పర్యటనను అడ్డుకునే హక్కు టీడీపీ, ఇతర పార్టీలకు లేదన్నారు. రాహుల్ తో పాటు ఈరోజు అనంతపురం జిల్లా పర్యటనకు డిగ్గీరాజా కూడా వచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, తెలంగాణకోసం మొదట లేఖ ఇచ్చింది సీఎం చంద్రబాబేనని గుర్తు చేశారు. ఆయనెప్పుడూ సొంత ప్రచారం కోసమే ఆరాటపడుతుంటారని, రాష్ట్రం కోసం కాదని ఆరోపించారు. ఇందుకు పుష్కరాల తొలిరోజు రాజమండ్రిలో జరిగిన తొక్కిసలాట ఘటనే నిదర్శనమని విమర్శించారు. రాజధాని నిర్మాణం కూడా ప్రచార ఆర్భాటంలో భాగమేనని దిగ్విజయ్ వ్యాఖ్యానించారు.