: కేసీఆర్ కు ఫిరాయింపులపై ఉన్న శ్రద్ధ ప్రజా సమస్యలపై లేదు: బీజేపీ నేత లక్ష్మణ్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై బీజేపీ శాసనసభాపక్ష నేత డాక్టర్ కె.లక్ష్మణ్ మండిపడ్డారు. కేసీఆర్ కు ఫిరాయింపులపై ఉన్న శ్రద్ధ ప్రజా సమస్యలను పరిష్కరించడంపై లేదని ఆరోపించారు. ఎప్పుడు, ఏ ఎన్నికలు జరిగినా తెలంగాణ సెంటిమెంట్ ను వాడుకుని గట్టెక్కాలన్నదే కేసీఆర్ ఆలోచన అంటూ దుయ్యబట్టారు. సెంటిమెంట్ ద్వారా లాభపడటానికి కేసీఆర్ రకరకాల కుట్రలు చేస్తుంటారని విమర్శించారు. కేసీఆర్ కు పాలనపై శ్రద్ధ లేదని మండిపడ్డారు. ఇతర పార్టీల నేతలను లాక్కోవడమేనా బంగారు తెలంగాణ? అంటూ లక్ష్మణ్ ప్రశ్నించారు.