: టీడీపీ, వైసీపీలపై రాహుల్ ఫైర్... ప్రత్యేక హోదా పట్టట్లేదని నిందారోపణ


కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అనంతపురం జిల్లా పర్యటనలో ప్రత్యర్థి పార్టీలపై నిప్పులు చెరిగారు. అటు కేంద్రంలోనే కాక ఇటు రాష్ట్రంలోనూ కాంగ్రెస్ ప్రత్యర్థి పార్టీలపై రాహుల్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అనంతపురం జిల్లా ఓటుళదేవర చెరువులో రైతులతో ముఖాముఖి సందర్భంగా తొలుత నరేంద్ర మోదీ సర్కారుపై విమర్శలు గుప్పించిన రాహుల్ గాంధీ, ఆ తర్వాత ఏపీలోని అధికార టీడీపీ, విపక్ష వైసీపీలపై నిప్పులు చెరిగారు. ఏపీకి ప్రత్యేక హోదా పట్టనట్లుగా ఆ రెండు పార్టీలు వ్యవహరిస్తున్నాయని ఆయన ఆరోపించారు. కేంద్రాన్ని ప్రశ్నించేందుకు ఎందుకు భయపడుతున్నారని ఆయన ఆ రెండు పార్టీలను నిలదీశారు. ప్రత్యేక హోదాతో ఏపీ దేశంలోని అన్ని రాష్ట్రాల్లోకి అగ్రగామిగా నిలవనుందన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్ పోరాడుతుందని ఆయన ప్రకటించారు.

  • Loading...

More Telugu News