: ఐటీ కొలువుల్లో ‘టాప్’ లేపిన టీసీఎస్!
ఐటీ రంగంలో అత్యధిక మందికి ఉద్యోగాలిచ్చిన అగ్రగ్రామి సంస్థల్లో టాటా గ్రూపుల సంస్థ టీసీఎస్ ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ మేరకు నిన్న విడుదలైన ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్ నివేదిక వెల్లడించింది. నాస్కామ్ విడుదల చేసిన టాప్ 20 సంస్థల జాబితాలో అగ్రభాగాన టీసీఎస్ నిలవగా, ఆ తర్వాతి స్థానాలను కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్ ఆక్రమించాయి. దేశీయ ఐటీ, బీపీఓ రంగాల్లో టాప్ 20 సంస్థల్లోనే 12.5 లక్షల మంది ఉద్యోగులున్నారని ఈ సందర్భంగా నాస్కామ్ ప్రెసిడెంట్ ఆర్ చంద్రశేఖర్ తెలిపారు.