: ఇక ‘ఈఎంఐ’తోనూ ఫ్లైట్ టికెట్!... స్పైస్ జెట్ సరికొత్త పథకం


విమానయానంలో ‘స్పైస్ జెట్’ది ఎప్పుడూ కొత్త ఒరవడే. కేవలం రూ.1 కే విమానయానాన్ని ఆఫర్ చేసిన ఆ సంస్థ, ఆకాశయానాన్ని సామాన్యుడికి మరింత చేరువ చేసేందుకు మరో సరికొత్త పథకాన్ని ప్రకటించింది. ఈ పథకం కింద నెలవారీ వాయిదాల(ఈఎంఐ) పద్ధతిలోనూ టికెట్లను అందించనుంది. ‘బుక్ నౌ... పే లేటర్’ పేరిట ఆ కంపెనీ నిన్న ప్రకటించిన ఈ పథకం ద్వారా ఒకేసారి మొత్తం డబ్బును చెల్లించి ఫ్లైట్ టికెట్ కొనాల్సిన అవసరం ఉండదు. నెలవారీ వాయిదాల పద్ధతిన సదరు మొత్తాన్ని చెల్లించే వీలుంది. అయితే ఎంపిక చేసిన బ్యాంకుల క్రెడిట్ కార్డు హోల్డర్లకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుందని ఆ కంపెనీ ప్రకటించింది.

  • Loading...

More Telugu News