: అచ్చే దిన్ ఎక్కడ?... మోదీ సర్కారుపై శివసేన చీఫ్ ప్రశ్నాస్త్రాలు
ఎన్డీఏ ప్రభుత్వంలో మిత్రపక్షంగా ఉన్న శివసేన మరోమారు బీజేపీపై విమర్శలు గుప్పించింది. ఏడాది క్రితం నాటి ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీ చెప్పిన ‘అచ్చే దిన్ ఎక్కడ?’ అంటూ శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే నిలదీశారు. శివసేన సొంత పత్రిక ‘సామ్నా’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఉద్ధవ్ చేసిన వ్యాఖ్యలు మరోమారు ఎన్డీఏలో కలకలం రేపుతున్నాయి. ‘‘ఏడాది అయిపోయింది. ఏం మార్పు వచ్చింది? అచ్చే దిన్ భావన ఛాయలు కూడా కనిపించడం లేదు. గతంలో దినపత్రికల్లో పరమ బోరు కొట్టించిన వార్తలే ఇప్పుడూ దర్శనమిస్తున్నాయి. ఏ రోజు పేపర్ తిరగేసినా, ఈ వార్తను ఎక్కడో చదివామే అన్న భావన కలుగుతోంది. అటు కేంద్రంలోనే కాక ఇటు మహారాష్ట్రలోనూ పరిస్థితుల్లో మెరుగుదలే కనిపించడం లేదు’’ అని ఉద్ధవ్ వ్యాఖ్యానించారు.