: రాజమండ్రి ఘటనలో విద్రోహ శక్తుల ప్రమేయం ఉంది: కింజరాపు అచ్చెన్నాయుడు


పుష్కరాల ప్రారంభోత్సవం సందర్భంగా చోటుచేసుకున్న తొక్కిసలాటలో విద్రోహశక్తుల ప్రమేయం ఉందని ఆంధ్రప్రదేశ్ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆరోపించారు. టెక్కలిలో ఆయన మాట్లాడుతూ, తొలిరోజు జరిగిన సంఘటన వెనుక విద్రోహ శక్తుల ప్రమేయం ఉన్నట్టు సమాచారం అందిందని అన్నారు. ముఖ్యమంత్రికి, ప్రభుత్వానికి ఎక్కడ మంచి పేరు వచ్చేస్తుందోనన్న దుగ్ధతో పుష్కరాల ప్రారంభోత్సవానికి ముందే విద్యుత్ షాక్ తో ఇద్దరు మృతి చెందారనే పుకార్లు ప్రచారం చేశారని, దాని కారణంగానే తొక్కిసలాట జరిగిందని ఆయన తెలిపారు. దీనిపై న్యాయ విచారణ చేయిస్తామని అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటి వరకు 4.12 కోట్ల మంది ప్రజలు పుష్కర స్నానమాచరించారని ఆయన వెల్లడించారు. చివరి రెండు రోజులు పుష్కరఘాట్లకు ప్రజలు పోటెత్తుతారని భావించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఆయన చెప్పారు. 25న సాయంత్రం 6 గంటలకు గ్రామాల్లో ప్రతి ఇంటా పుష్కర దీపారాధన ఘనంగా నిర్వహించాలని ఆయన పిలుపునిచ్చారు.

  • Loading...

More Telugu News