: బోటనీ, మెడికల్ సైన్స్ ఏదైనా ఓకే... నేను సైంటిస్టు బాబాని: యోగా గురు రాందేవ్


సుప్రసిద్ధ యోగా గురువు బాబా రాందేవ్ తాను 'సైంటిస్టు బాబా'నంటున్నారు. బోటనీ, మెడికల్ సైన్స్ ఇలా దేనిపైన అయినా తాను అనర్గళంగా మాట్లాడగలనని ధీమాగా చెబుతున్నారు. ఆయన ఎందుకిలా అంటున్నారో తెలుసుకునే ముందు ఇది తెలుసుకోవాలి. ఇటీవల దేశంలోని ఐఐటీలను గ్రామీణాభివృద్ధి పథకంలో భాగస్వాములను చేశారు. ఈ పథకంలో భాగంగా ఐఐటీలతో కలిసి పనిచేసేందుకు రాందేవ్ కు చెందిన పతంజలి పీఠ్ తో పాటు గాయత్రి పరివార్, స్వామి సంపూర్ణానంద్, స్వామి రాజేంద్ర దాస్, స్వామి ముక్తానంద్, స్వామి విషుదానంద్ లకు చెందిన ధార్మిక సంస్థలకు, వనవాసి కల్యాణ్ ఆశ్రమానికి అవకాశం కల్పించారు. జనవరిలో జరిగిన ఉన్నత్ భారత్ యోజన సమావేశంలో ఈ మేరకు నిర్ణయించారు. అయితే, ఈ పథకంలో బాబా రాందేవ్ సంస్థను చేర్చడంపై విమర్శలు వచ్చాయి. ఆయనకు టెక్నాలజీ ఏం తెలుసని పలువురు ప్రశ్నించారు. ఈ విషయమై ఆయనను మీడియా ప్రశ్నించింది. ఢిల్లీ శివారు ప్రాంతంలోని విలాసవంతమైన ఫాంహౌస్ లో రాందేవ్ మీడియా ప్రతినిధితో మాట్లాడుతూ... "నేను రైతు కుటుంబంలో పుట్టాను. ఇప్పుడు యోగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నాను. యోగాను సైన్స్ తో అనుసంధానించాం. దీనిపైనే కాదు ఏ విషయంపైన అయినా నేను సాధికారికంగా మాట్లాడగలను. రైతులకు మేలు చేయాలన్నది నా అభిమతం. ఇప్పటికే ఈ ఉన్నత్ భారత్ యోజన పథకంపై రూ.500 కోట్లు ఖర్చు చేశాను. ఇక, మా పతంజలి పీఠ్ ఉత్పత్తులన్నీ సైంటిఫిక్ గా నిరూపితమైనవే" అని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News