: మా ఎంపీల డిమాండ్ న్యాయమైనదే: రాహుల్ గాంధీ


అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులు పదవులకు రాజీనామా చేసిన తరువాతే పార్లమెంటులో చర్చ జరిగేందుకు సహకరిస్తామని కాంగ్రెస్ నేతలు చేస్తున్న డిమాండ్ ను ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సమర్థించారు. పార్లమెంటు వెలుపల రాహుల్ గాంధీ మాట్లాడుతూ, కుంభకోణాలపై నోరు మెదపకుండా ప్రధాని మోదీ దేశ ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు. లలిత్ గేట్ వివాదంలో కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్, రాజస్థాన్ సీఎం వసుంధర రాజె, వ్యాపం కుంభకోణంలో మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ రాజీనామా చేయాలని ఆయన స్పష్టం చేశారు. లలిత్ మోదీ విషయంలో కేంద్ర మంత్రిగా సుష్మా స్వరాజ్ సాయం చేయడం నేరమని, అందుకు ఆమె రాజీనామా చేయాల్సిందేనని, ఆమె రాజీనామా తరువాత పార్లమెంటు ఉభయసభలు సజావుగా సాగుతాయని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News