: 'నదిలో మునిగి రండి' అంటూ ఉడాయించాడు.... పుష్కరాల్లో నకిలీ పూజారులు!
రాజమండ్రి పుష్కరాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఎన్ని ఏర్పాట్లు చేసినా కొన్ని లోపాలు కనిపిస్తూనే ఉన్నాయి. కొందరు పూజారుల వేషంలో చేతివాటం ప్రదర్శిస్తున్నారు. పుష్కరస్నానం చేసేందుకు వచ్చిన వృద్ధ దంపతులను ఓ నకిలీ పూజారి నమ్మించి మోసం చేశాడు. "ముందు మీరు నదిలో స్నానమాచరించి రండి... అప్పటివరకు మీ సామాన్లు జాగ్రత్తగా చూసే బాధ్యత నాదీ" అంటూ ఆ వ్యక్తి దంపతులను నమ్మబలికాడు. అతడు పూజారే అని నమ్మిన ఆ వృద్ధులు నదిలో స్నానం చేసి వచ్చారు. అయితే, అప్పటికే ఆ నకిలీ పూజారి సామాన్లతో ఉడాయించాడు. దీంతో, ఆ దంపతులు లబోదిబోమన్నారు. ఘటనపై సమాచారం అందుకున్న అధికారులు... ఐడెంటిటీ కార్డులు ఉన్న పూజారులతోనే పిండప్రదానం తదితర క్రతువులు చేయించుకోవాలని భక్తులకు సూచిస్తున్నారు.