: రాజమండ్రి తొక్కిసలాటపై హైకోర్టుకు వెళతా: హర్షకుమార్ కుమారుడు శ్రీరాజ్
రాజమండ్రి పుష్కరఘాట్ లో చోటుచేసుకున్న తొక్కిసలాటపై హైకోర్టుకు వెళతానని మాజీ ఎంపీ హర్షకుమార్ కుమారుడు శ్రీరాజ్ తెలిపాడు. తొక్కిసలాటకు తన తండ్రే కారణమని అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని... సెంట్రల్ జైల్లో ఉండి, కనీసం ఫోన్ లో కూడా మాట్లాడలేని స్థితిలో ఉన్న తన తండ్రి తొక్కిసలాటకు ఎలా కారణమవుతారని ఆయన ప్రశ్నించారు. తొక్కిసలాటకు అధికారులు, పోలీసులే కారణమని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, జిల్లా కలెక్టర్, ఎస్పీ, దర్శకుడు బోయపాటిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. పుష్కరాల్లో ఏ హోదాతో బోయపాటి మైక్ పట్టుకున్నారని ప్రశ్నించారు. దీక్ష చేస్తున్న సమయంలో తన తండ్రి పట్ల వ్యవహరించిన తీరు కూడా సరిగా లేదని మండిపడ్డారు. దీక్ష చేస్తున్నప్పుడు 36 గంటల్లో కనీసం డాక్టర్ ను కూడా పంపలేదని, ఆ తర్వాత నిర్దాక్షిణ్యంగా ఈడ్చుకెళ్లారని ఆరోపించారు.