: వారి రాజధాని, వారికి ఇష్టం వచ్చినట్టు కట్టుకోనివ్వండి: అమరావతిపై మైసూరా నిర్వేదం


నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతిపై వైకాపా సీనియర్ నేత మైసూరా రెడ్డి నిర్వేదం వ్యక్తం చేశారు. 'వాళ్ల రాజధానిని వారి ఇష్టం వచ్చినట్టు కట్టుకోనివ్వండి' అంటూ వ్యాఖ్యానించారు. రాజధాని నిర్మాణాన్ని టీడీపీ తనకిష్టమైన రీతిలో చేపడుతోందని, ఇతరుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోలేదని అన్నారు. ఈ సందర్భంలో, అమరావతిపై మాట్లాడటం కూడా వేస్టే అని చెప్పారు. అమరావతి నిర్మాణం పట్ల రాయలసీమ వాసుల్లో కూడా నిర్వేదం ఏర్పడిందని తెలిపారు. రాయలసీమ ప్రత్యేక ఉద్యమానికి నాయకత్వం వహించాలంటూ ఇప్పటికే కొందరు తనను సంప్రదించారని వెల్లడించారు. గతంలో రాష్ట్రంలో ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ ప్రాంతాలు ఉంటే, ఇప్పుడు ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలున్నాయని... రాయలసీమకు మళ్లీ అన్యాయం జరిగే పరిస్థితులు కనపడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News