: రాజకీయం అంటే ఏంటో కూడా నాకు తెలీదు... అయినా మా బావ ఉన్నాడుగా!: మహేష్ బాబు
తాను రాజకీయాల్లోకి వచ్చే సమస్యే లేదని అంటున్నాడు ప్రిన్స్ మహేష్ బాబు. మరో రెండు వారాల్లో తాను నటించిన 'శ్రీమంతుడు' చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్న సందర్భంగా 'ఇండియా టుడే' మేగజైన్ కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. తనకు రాజకీయాలు అర్థం కావని అన్నాడు. "మా నాన్న గారు గతంలో రాజకీయాల్లో కృషి చేశారు. మా బావ గల్లా జయదేవ్ ప్రస్తుతం గుంటూరు ఎంపీగా ఉన్నారు. అయినప్పటికీ, నేను రాజకీయాల్లోకి ప్రవేశించను. ఆ సంగతులేవీ నాకు తెలియదు" అన్నాడు. సంవత్సరానికి రెండు చిత్రాల్లో నటించేందుకు కృషి చేస్తానని వివరించాడు. 'దూకుడు' తరువాత తనకు అంతగా నచ్చిన పాటలు 'శ్రీమంతుడు' చిత్రంలోనే ఉన్నాయని తెలిపాడు. తనపై సూపర్ స్టార్ కృష్ణ ప్రభావం ఎంతో ఉందని, ఆయనే తనకు స్ఫూర్తని తెలియజేశాడు.