: ప్రేయసిని ‘రెండు’ సార్లు పెళ్లి చేసుకోనున్న దినేశ్ కార్తీక్!
చాలా కాలంగా ప్రేమలో మునిగి తేలుతున్న ప్రముఖ క్రికెటర్ దినేశ్ కార్తీక్, స్క్వాష్ ప్లేయర్ దీపికా పల్లికల్ ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కనున్నారు. ఈ వివాహానికి ఓ ప్రత్యేకత ఉంది. అదేంటంటే, దీపికాను దినేశ్ కార్తీక్ ఏకంగా ‘రెండు’ సార్లు పెళ్లి చేసుకుంటాడట. ఎలా అంటే, వచ్చే నెల 18న క్రిస్టియన్ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకోనున్న కార్తీక్, ఆ తర్వాత తిరిగి అదే నెల 20న హిందూ సంప్రదాయం ప్రకారం మరోమారు వివాహమాడతాడట. చెన్నైలోని ఓ హోటల్ లో జరగనున్న వీరి పెళ్లికి ఏర్పాట్లన్నింటినీ ఇరు కుటుంబాలు పూర్తి చేసుకున్నాయి. అయినా ఒకే పెళ్లిని రెండు సార్లు ఎందుకు చేసుకుంటున్నారంటే... దీపికా పల్లికల్ క్రిస్టియన్ కాగా, దినేశ్ కార్తీక్ ఏపీ నుంచి చెన్నైకి వలస వెళ్లిన హిందూ కుటుంబానికి చెందిన వాడు. దీంతో ఇరు కుటుంబాల కోరిక మేరకు రెండు మతాల సంప్రదాయాల ప్రకారం పెళ్లి తంతును నిర్వహించాలని నిర్ణయించారట. వచ్చే నెల 18న క్రిస్టియన్ సంప్రదాయం ప్రకారం వీరి వివాహం జరగనుండగా, రెండు రోజుల తర్వాత 20న జరగనున్న హిందూ పెళ్లి ‘తెలుగు నాయుడు’ సంప్రదాయ రీతిలో జరుగుతుందట.