: గవర్నర్ కు ‘ప్రత్యేక’ అధికారాలున్నాయిగా!: ‘గల్లా’ ప్రశ్నకు హోం శాఖ సమాధానం


హైదరాబాదులో పౌరుల భద్రతను దృష్టిలో పెట్టుకుని ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టంలో గవర్నర్ కు ప్రత్యేక అధికారాలను కల్పించినట్లు కేంద్ర హోం శాఖ ప్రకటించింది. ఈ మేరకు ఆ శాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజూ సాక్షాత్తు పార్లమెంటుకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. గుంటూరు ఎంపీ, టీడీపీ యువనేత గల్లా జయదేవ్ అడిగిన ప్రశ్నకు రిజిజూ ఈ మేరకు సమాధానమిచ్చారు. విభజన చట్టంలో సెక్షన్ 8 ప్రకారం ఉమ్మడి రాజధానిలో శాంతిభద్రతలు, అంతర్గత భద్రత, కీలక సంస్థల రక్షణ, ప్రభుత్వ కార్యాలయాల నిర్వహణ, కేటాయింపులపై గవర్నర్ కు బాధ్యతలు కట్టబెట్టడం జరిగిందని కూడా ఆయన తెలిపారు. ‘‘విభజన చట్టంలోని సెక్షన్ 8(1) ప్రకారం పరిపాలన ఉద్దేశంతోనే హైదరాబాదు ఉమ్మడి రాజధాని అయ్యింది. ఈ ప్రాంతంలో నివసించే ప్రజల ప్రాణాలు, స్వేచ్ఛ, ఆస్తుల రక్షణ కోసం గవర్నర్ కు ప్రత్యేక బాధ్యతలు కల్పించాం’’ అని ఆ సమాధానంలో కేంద్రం విస్పష్టంగా ప్రకటించింది. అయితే ఇటీవలి కాలంలో హైదరాబాదులో పౌరుల రక్షణ, ఆస్తులకు సంబంధించి ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాలేదని మంత్రి పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News