: ప్రశంసలందుకుంటున్న శంషాబాద్ ఎయిర్ పోర్టు


కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ దేశంలోని అన్ని ప్రధాన విమానాశ్రయాల్లో ఎలక్ట్రానిక్ బోర్డింగ్ విధానాన్ని తీసుకురావాలని భావిస్తోంది. పైలట్ ప్రాజెక్టుగా ఈ వినూత్న ఈ-బోర్డింగ్ విధానాన్ని తొలుత శంషాబాద్ ఎయిర్ పోర్టులో ప్రవేశపెట్టారు. ఏప్రిల్ లో ప్రారంభమైన ఈ ప్రాజెక్టును పూర్తిస్థాయిలో అమలు చేయడం ద్వారా శంషాబాద్ ఎయిర్ పోర్టు కేంద్రం ప్రశంసలందుకుంది. ఎలాంటి అవాంతరాలకు తావివ్వకుండా, విజయవంతంగా ఈ-బోర్డింగ్ ను అమలు చేశారని ఎయిర్ పోర్టు అథారిటీకి అభినందనలు వెల్లువెత్తాయి. ఈ మేరకు జీఎంఆర్ ప్రతినిధులు ఓ ప్రకటన విడుదల చేశారు. దీనిపై విమానయాన మంత్రిత్వ శాఖ స్పందిస్తూ త్వరలోనే ఈ-బోర్డింగ్ ను మరిన్ని విమానాశ్రాయాల్లో ప్రవేశపెడతామని తెలిపింది. కాగా, ఈ-బోర్డింగ్ ప్రాజెక్టులో జెట్ ఎయిర్ వేస్ భాగస్వామ్యం కూడా ఉంది.

  • Loading...

More Telugu News