: శశి థరూర్ పై మేడమ్ మండిపాటు!


మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత శశి థరూర్ పై పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ వైఖరికి భిన్నంగా థరూర్ నడుచుకుంటున్నారని ఆమె మండిపడ్డారు. థరూర్ ఎప్పుడూ ఇంతేనని ఆమె అసహనం వ్యక్తం చేశారు. పార్లమెంటులో సభా కార్యక్రమాలకు అడ్డుతగలరాదని, సభకు ఆటంకాలు కలిగిస్తూ వాయిదాలకు కారణం కారాదని ఇతర కాంగ్రెస్ నేతలకు థరూర్ సూచించడం మేడమ్ కు నచ్చలేదని పార్టీ వర్గాలంటున్నాయి. ఇతర కాంగ్రెస్ సీనియర్లు కూడా థరూర్ పై ఆరోపణలు చేస్తున్నారు. క్రమశిక్షణను ఆయన ఉల్లంఘిస్తున్నారని వారు పేర్కొన్నారు. ఇటీవల థరూర్ తరచుగా ప్రధాని నరేంద్ర మోదీని ప్రస్తుతిస్తుండడం కాంగ్రెస్ అధిష్ఠానానికి రుచించడంలేదు.

  • Loading...

More Telugu News