: డాక్టర్లు, నర్సులు వేసుకునే తెల్లగౌన్లు నిషేధించాలి


భారతీయ వైద్యులు, వైద్య విద్యార్థులు, వైద్య సిబ్బంది ధరించే తెల్ల గౌన్లు (ఏప్రాన్లు) నిషేధించాలని బెంగళూరుకు చెందిన వైద్య విద్యార్థి ఎడ్మండ్ ఫెర్నాండెజ్ డిమాండ్ చేస్తున్నారు. తెల్ల డ్రెస్ కారణంగా ఇన్ఫెక్షన్లు త్వరగా వ్యాప్తి చెందుతున్నాయని ఓ సర్వే వెల్లడించిందని ఆయన తెలిపారు. 19వ శతాబ్ధం నుంచి వైద్యులు, వైద్య విద్యార్థులు తెల్ల గౌనును సంప్రదాయంగా ధరిస్తున్నారని, యాప్రాన్లు వ్యాధులను విస్తరింపజేసే వాహకాలుగా పని చేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. దీంతో యాప్రాన్ల నిషేధంపై భారత ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకోవాలని ఆయన కోరారు. 2007లో తెల్ల గౌను నిషేధిస్తూ అమెరికా నిర్ణయం తీసుకుందని, దీనిని అమెరికన్ మెడికల్ అసోసియేషన్ ఆమోదించిందని ఆయన పేర్కొన్నారు. వైద్యులు, వైద్య సిబ్బందికి ఆకట్టుకునే దుస్తులు, ముఖంపై చెరగని చిరునవ్వు ముఖ్యమని ఆయన అభిప్రాయపడుతున్నారు. అలాగే దుస్తులపై వైద్యుడి పేరు తెలిపేలా బ్యాడ్జ్ ధరించాలని ఆయన సూచించారు.

  • Loading...

More Telugu News