: చెన్నై, రాజస్థాన్ ఆటగాళ్ల భవితవ్యంపై ఇప్పుడే మాట్లాడలేం: లక్ష్మణ్
భారత క్రికెట్ దిగ్గజం వీవీఎస్ లక్ష్మణ్ ఐపీఎల్ ఫిక్సింగ్ వ్యవహారంలో లోథా కమిటీ తీర్పుపై స్పందించారు. చైన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ ఆటగాళ్ల భవితవ్యంపై ఇప్పుడేమీ మాట్లాడలేమని అన్నారు. బీసీసీఐ ఈ సమస్యను పరిష్కరిస్తుందని పేర్కొన్నారు. చెన్నై, రాజస్థాన్ ఫ్రాంచైజీలను రెండేళ్ల పాటు నిషేధించడం దురదృష్టకరమని, అయితే, క్రికెట్ కంటే ఏదీ గొప్పది కాదని అన్నారు. అంతిమ విజేత క్రికెటేనని ఉద్ఘాటించారు. సీనియర్లతో డ్రెస్సింగ్ రూం పంచుకునే అవకాశం యువ క్రికెటర్లకు లభించిందంటే అది ఐపీఎల్ వల్లేనని స్పష్టం చేశారు. లీగ్ పై కొన్ని మచ్చలు పడినా, ఎన్నో సానుకూలాంశాలు ఉన్నాయని తెలిపారు.