: ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ


రాజమండ్రిలోని ఆర్ అండ్ బి అతిథిగృహంలో నిర్వహించిన ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. దాదాపు నాలుగు గంటలపాటు జరిగిన భేటీలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. ప్రధానంగా పుష్కరాలకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. పుష్కరాల ముగింపు సందర్భంగా మహా దీపారాధన పేరుతో ప్రతి ఇంట్లో దీపారాధన చేయించాలని నిర్ణయించారు. పుష్కరాల్లో పనిచేసిన వివిధ విభాగాల్లోని ఉద్యోగులను ఈ నెల 26న సన్మానించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక కృష్ణా జిల్లా ముసునూరు తహశీల్దార్ వనజాక్షిపై దాడి ఘటనను కూడా మంత్రివర్గం చర్చించింది. ఆ విషయంలో ఆమెదే తప్పని తేల్చింది. వనజాక్షే ఇసుక రీచ్ ప్రాంతంలో పరిధులు దాటి విధులు నిర్వహించారని, పార్టీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తప్పేమిలేదని తేల్చింది.

  • Loading...

More Telugu News