: పుష్కరాల ముగింపు రోజున దీపావళి!


పుష్కరాల ముగింపు రోజును ప్రజలు దీపావళి పండగలా జరుపుకోవాలని ఏపీ సర్కారు పిలుపునిచ్చింది. ఈ నెల 25న పుష్కరాలు ముగుస్తున్నాయని, ఆ రోజు ప్రతి ఇంటా ప్రత్యేక దీపాలను వెలిగించాలని, గుమ్మాలను దీపాలతో అలంకరించాలని సూచించింది. దీనికి 'పుష్కరజ్యోతి'గా నామకరణం చేయాలని నిర్ణయించింది. ఈ ఉదయం రాజమండ్రిలో మంత్రివర్గ సహచరులతో సమావేశమైన సమయంలో, బాబు ఈ 'పుష్కరజ్యోతి' ఆలోచనను పంచుకున్నారు. ఈ విషయమై ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు ప్రచారం చేపట్టాలనీ ఆయన ఆదేశించారు. కాగా, పుష్కరాల తొమ్మిదో రోజు వర్షం పడుతున్నప్పటికీ, పుణ్య స్నానాలు ఆచరించేందుకు భక్తులు పోటెత్తారు.

  • Loading...

More Telugu News