: మీరు రాజధాని గొప్పగా కట్టుకోండి....మా బతుకు మమ్మల్ని బతకనివ్వండి: కేసీఆర్ వ్యాఖ్య
టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు మరోమారు సీమాంధ్రులపై భగ్గుమన్నారు. హైదరాబాదులోని రవీంద్రభారతిలో కొద్దిసేపటి క్రితం ప్రారంభమైన దాశరథి జయంతి ఉత్సవాలకు హాజరైన సందర్భంగా కేసీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘‘మీరు రాజధానిని గొప్పగా కట్టుకోండి. సంతోషిస్తాం. మా బతుకు మమ్మల్ని బతకనివ్వండి. మమ్మల్ని ఒక్క మాట అంటే, మేం పది మాటలు అంటాం’’ అని కేసీఆర్ అన్నారు.