: ఆలుగడ్డ శీను కంటే నేనే సీనియర్... తలసాని కామెంట్లపై షబ్బీర్ అలీ ధ్వజం
శాసనసభ్యత్వానికి తలసాని రాజీనామా వ్యవహారంలో మాటల తూటాలు పేలుతున్నాయి. పార్టీ మారిన తలసాని తక్షణమే తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేయాలని అటు టీ టీడీపీ, కాంగ్రెస్ నేతలు వరుస దాడులు చేస్తున్నారు. వీటిపై నిన్న తలసాని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ఎమ్మెల్సీ షబ్చీర్ అలీపై తలసాని నిప్పులు చెరిగారు. నోరు అదుపులో పెట్టుకోకుంటే షబ్బీర్ బండారం బయటపెడతానని ఆయన వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై షబ్బీర్ అలీ కొద్దిసేపటి క్రితం తీవ్రంగా స్పందించారు. దమ్ముంటే తన బండారం బటయపెట్టాలని ఆయన తలసానికి సవాల్ విసిరారు. ‘‘అయినా రాజకీయాల్లో ఆలుగడ్డ శీను కంటే నేనే సీనియర్ ని’’ అని షబ్బీర్ తనదైన శైలిలో తలసానిపై ఎదురు దాడి చేశారు. అడిగిన దానికి సమాధానం చెప్పకుండా తలసాని నానా యాగీ చేస్తున్నారని ఆరోపించారు. తలసాని సంగతేంటో ప్రజలకు తెలుసని ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు.