: పాతబస్తీలో ఆపరేషన్ రోమియో...150 మంది లేట్ నైట్ రోమియోల అరెస్ట్, కౌన్సిలింగ్


నిన్నటిదాకా నేరగాళ్ల ఆట కట్టించేందుకు ‘కార్డాన్ అండ్ సెర్చి’ పేరిట సోదాలు చేసిన భాగ్యనగరి పోలీసులు తాజాగా ‘ఆపరేషన్ రోమియో’ ప్రారంభించారు. పనీపాటా లేకుండా రాత్రీ పగలనే తేడా లేకుండా రోడ్లపై బలాదూర్ గా తిరుగుతున్న ఆకతాయిల ఆట కట్టించడమే లక్ష్యంగా ఈ ఆపరేషన్ కు పోలీసులు శ్రీకారం చుట్టారు. నిన్న రాత్రి నగరవ్యాప్తంగా పోలీసులు సోదాలు చేశారు. ఈ సందర్భంగా పాతబస్తీ ప్రాంతంలో దాదాపు 150 మందికి పైగా లేట్ నైట్ రోమియోలు పోలీసులకు పట్టుబడ్డారు. వీరిలో 40 మంది దాకా మైనర్ బాలురున్నట్లు సమాచారం. వీరందరినీ పాతబస్తీలోని సానా గార్డెన్ ఫంక్షన్ హాల్లో కూర్చోబెట్టిన పోలీసులు వారి తల్లిండ్రులను పిలిపించి, వారి సమక్షంలో ఆకతాయిలకు బ్రెయిన్ వాష్ చేసి మరీ పంపించారు.

  • Loading...

More Telugu News