: అన్ని శాఖల్లోను లొసుగులున్నాయిగా?: తనను హెచ్చరించిన అధికారిపై మహిళా ఉద్యోగి ఎదురుదాడి


"మీపై ఫిర్యాదులు వస్తున్నాయి. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్నారు. జాగ్రత్తగా ఉండండి" అని ఓ ప్రభుత్వాధికారి చేసిన హెచ్చరికలకు దీటుగా స్పందిస్తూ, "మీరూ ప్రభుత్వాధికారే కదా? అందరి శాఖల్లో లొసుగులు మామూలే. మీ కింద అధికారులపై ఏం చర్యలు తీసుకున్నారు?" అని ప్రశ్నించిందో మహిళా ఉద్యోగి. ఈ ఘటన మహబూబ్ నగర్ జిల్లా కారూర్ లో జరిగింది. 'పల్లెవికాసం'లో భాగంగా ఆ గ్రామానికి వచ్చిన ఎమ్మార్వో చెన్న కిష్టప్ప స్థానిక అంగన్ వాడీ కేంద్రానికి వెళ్లి అక్కడి సీపీడీఓ బాలామణి పనితీరును ఆక్షేపించారు. పనితీరు మార్చుకోవాలని సూచించారు. దీంతో అంతే స్థాయిలో స్పందించిన బాలామణి ఎదురు మాట్లాడారు. ఈ మొత్తం తతంగాన్ని గ్రామస్తులు, పలువురు ప్రభుత్వ అధికారులు ఆసక్తిగా తిలకించడం గమనార్హం.

  • Loading...

More Telugu News