: పుష్కర భక్తులను దేవుడే కాపాడలేకపోయాడు... చంద్రబాబు మాత్రం ఏం చేస్తారు?: రామ్ గోపాల్ వర్మ


ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చివరకు పుష్కరాలను కూడా వదల్లేదు. రాజమండ్రిలోని పుష్కర ఘాట్ లో జరిగిన తొక్కిసలాటలో పలువురు మృత్యువాత పడటంపై ఆయన ట్విట్టర్లో స్పందించారు. భక్తులను సాక్షాత్తు దేవుడే కాపాడలేకపోయాడు. ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం ఏం చేస్తారంటూ వ్యాఖ్యానించారు. జరిగిన ఘటనపై అందరూ చంద్రబాబునే నిందించే ప్రయత్నం చేస్తున్నారు. దేవుడిని మాత్రం ఎవరూ దూషించడం లేదని అన్నారు. నదులను పరిశుభ్రంగా ఉంచుకోవడం వల్లే పలు దేశాలు అభివృద్ధి దిశగా పయనిస్తున్నాయని... మనం మాత్రం పుష్కరాల పేరుతో నదులను అపరిశుభ్రం చేస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. మంచి జరగాలని కోరుకునే వారికి ఎప్పుడూ మంచే జరుగుతుందని, ఎల్లప్పుడూ విచారంలో ఉండే వారు ఎప్పటికీ అలానే ఉంటారని ముక్తాయించారు.

  • Loading...

More Telugu News