: రేపు హైదరాబాదుకు టాటా గ్రూపు చైర్మన్ మిస్త్రీ... కేటీఆర్ తో కలిసి పరిశోధనా కేంద్రానికి శంకుస్థాపన
టాటా గ్రూపు చైర్మన్ సైరస్ మిస్త్రీ రేపు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాదు రానున్నారు. గచ్చిబౌలిలోని ట్రిపుల్ ఐటీ ప్రాంగణంలో కోహ్లీ పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సన్నాహాలు పూర్తి చేసింది. ఈ కేంద్రానికి తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్)తో కలిసి సైరస్ మిస్త్రీ శంకుస్థాపన చేయనున్నారు. ఈ సందర్భంగా ఆయనతో కేటీఆర్ పలు అంశాలపై చర్చలు జరపనున్నట్లు సమాచారం. హైదరాబాదులో టాటా గ్రూపు సంస్థల విస్తరణపై ఇరువురి మధ్య కీలక చర్చలు జరగనున్నట్లు తెలుస్తోంది.