: ‘అమరావతి అండ్ కో’లో జపాన్ సరికొత్త షరతు ఏంటంటే?


నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి నిర్మాణంలో జపాన్ ప్రభుత్వం కీలక పాత్ర పోషించడానికి సూత్రప్రాయంగా ఒప్పుకుంది. ఈ క్రమంలో కొత్తగా అరంగేట్రం చేయనున్న స్పెషల్ పర్పస్ వెహికిల్ ‘అమరావతి అండ్ కో’లో ప్రధాన వాటాదారుగా చేరేందుకూ ఆ దేశం సంసిద్ధత వ్యక్తం చేసింది. అయితే ఆ దేశ ప్రభుత్వం ఓ షరతు విధించింది. అదేంటంటే, రాజధాని నిర్మాణానికి అవసరమయ్యే వస్తు సామగ్రిలో 65 శాతాన్ని తమ దేశానికి చెందిన కంపెనీల నుంచే కొనుగోలు చేయాలట. మిగిలిన 35 శాతం వస్తు సామగ్రిని ఎక్కడ కొనుగోలు చేసుకున్నా, ఆ దేశానికి అభ్యంతరం లేదట. ఈ నిబంధనకు ఒప్పుకోని పక్షంలో మరో షరతును ఆ దేశం ప్రస్తావించింది. రాజధాని నిర్మాణం కోసం ఆ దేశం ఖర్చు చేసే మొత్తంపై 4 నుంచి 5 శాతం వడ్డీ చెల్లించాలని ప్రతిపాదించింది. ఈ రెండింటిపై తీవ్ర స్థాయిలో చర్చించిన ఏపీ ప్రభుత్వం తొలి షరతుకే మొగ్గుచూపే అవకాశాలున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఎందుకంటే, జపాన్ సంస్థల ఉత్పత్తుల్లో నాణ్యత ఉంటుందన్న విషయం తెలిసిందే. దీంతో ఆ దేశ కంపెనీల నుంచి వస్తు సామగ్రిని కొనుగోలు చేయడంలో వచ్చే ఇబ్బందేమీ లేదని కూడా ఏపీ అధికారవర్గాలు పేర్కొంటున్నాయి.

  • Loading...

More Telugu News