: అన్నా... ఎంతకాలమైంది మిమ్మల్ని చూసి!: జానాకు తుమ్మల ఆత్మీయ పలకరింపు
తెలంగాణ రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, అసెంబ్లీలో కాంగ్రెస్ పక్షనేత కుందూరు జానారెడ్డిల మధ్య నిన్న ఆసక్తికర పలకరింపులు చోటుచేసుకున్నాయి. దుమ్ముగూడెం ప్రాజెక్టు పరిశీలనకు వచ్చిన ఈ ఇద్దరు నేతలు ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకోవడమే కాక కరచాలనం చేసుకున్నారు. జానారెడ్డిని చూడగానే ‘‘అన్నా... ఎంతకాలమైంది మిమ్మల్ని చూసి’’ అంటూ తుమ్మల ఆప్యాయంగా పలకరించారు. దీంతో జానారెడ్డి కూడా తుమ్మలకు చేయందించారు. రాజకీయాల్లో వైరివర్గాలుగా సాగుతున్న వీరిద్దరి మధ్య కరచాలనం, ఆత్మీయ పలకరింపులను చూసిన కాంగ్రెస్ నేత రాంరెడ్డి వెంకటరెడ్డి తదితరులు కడుపారా నవ్వుకున్నారు.