: వర్షంలో బైక్ పై ఏపీ మంత్రి నారాయణ!... పుష్కర ఘాట్లను పరిశీలిస్తున్న వైనం
ఏపీ మునిసిపల్ శాఖ మంత్రి నారాయణ మళ్లీ బైక్ ఎక్కారు. అసలే జోరు వాన, ఆపై పుష్కరాలకు పోటెత్తిన భక్తులు... అయినా నారాయణ లెక్క చేయలేదు. బైక్ ఎక్కి పుష్కర ఘాట్లలో ఏర్పాట్లు, భక్తుల రద్దీ తదితరాలను ఆయన స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. వ్యక్తిగత భద్రతా సిబ్బంది వారిస్తున్నా వినకుండా ఆయన బైక్ ఎక్కేశారు. పుష్కరాలను పురస్కరించుకుని తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో మకాం పెట్టిన నారాయణ, నేటి ఉదయమే పుష్కర ఘాట్ల వద్దకు చేరుకున్నారు. క్రమంగా భక్తుల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో కారును పక్కనబెట్టేసిన ఆయన బైక్ పైనే పరిస్థితిని సమీక్షిస్తున్నారు.