: గురువాయూర్ శ్రీకృష్ణ దేవాలయానికి బాంబు బెదిరింపు
కేరళలోని గురవాయూర్ లో ఉన్న శ్రీకృష్ణ దేవాలయం ఎంతో ప్రసిద్ధికెక్కింది. ఈ ఆలయ సందర్శనకు విదేశాల నుంచి కూడా భక్తులు వస్తుంటారు. అయితే, దేవాలయానికి బాంబు బెదిరింపు రావడంతో తీవ్ర కలకలం రేగింది. 24 గంటల్లో ఆలయాన్ని పేల్చివేస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి ఆలయ సిబ్బందిని బెదిరించారు. ఫోన్ కాల్ తో హడలిపోయిన ఆలయ సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో, పోలీసులు, బాంబు స్క్వాడ్ సిబ్బంది ఆలయ ప్రాంగణం లోపల, పరిసరాల్లోనూ తనిఖీలు చేపట్టారు. కాగా, బెదిరింపు కాల్ ఖతార్ నుంచి వచ్చినట్టు గుర్తించారు. బెదిరింపు కాల్ నేపథ్యంలో ఆలయ పరిసర ప్రాంతాల్లో భద్రత కట్టుదిట్టం చేశారు.