: తెలంగాణ చేనేత కార్మికులకు శుభవార్త... ఒక్కో కుటుంబానికి రూ.లక్ష రుణ మాఫీ
తెలంగాణ రాష్ట్రంలో చేనేత కార్మికులకు శుభవార్త. మరమగ్గాల కార్మికుల రుణమాఫీకి ప్రభుత్వం, మార్గదర్శకాలు జారీ చేసింది. మొత్తం రూ.5.65 కోట్ల రుణాలు మాఫీ చేస్తూ తెలంగాణ సర్కారు ఉత్తర్వులు ఇచ్చింది. ఈ క్రమంలో ఒక్కో కుటుంబానికి రూ.లక్ష రుణ మాఫీ చేయనుంది. సెప్టెంబర్ 30లోగా రుణమాఫీ ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులకు ప్రభుత్వం ఆదేశాలిచ్చింది.