: కోటికి పైగా జీతం అందుకుంటున్నవాళ్లు ఇన్ఫోసిస్ కంటే ఈ సంస్థలోనే ఎక్కువట!


హిందూస్థాన్ యూనిలీవర్ సంస్థ భారత్ లో ప్రముఖ ఉత్పాదక సంస్థగా కొనసాగుతోంది. కొన్నాళ్లుగా డిమాండ్ తగ్గుముఖం పట్టడంతో ఈ సంస్థ వ్యాపారం స్వల్పంగా మందగించింది. అయినాగానీ, ఉద్యోగులకు మెరుగైన వేతనాలివ్వడంలో ఈ సంస్థ ముందు వరుసలోనే ఉంది. హిందూస్థాన్ యూనిలీవర్ లో రూ.కోటికి పైగా వార్షిక వేతనం అందుకుంటున్నవారు సుమారు 170 మంది ఉండగా, ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ లో హై శాలరీ అందుకుంటున్న వారు 113 మందే ఉన్నారట. ఇక, హిందూస్థాన్ యూనిలీవర్ సంస్థలో అత్యధిక వేతనం సీఈవో, ఎండీ సంజీవ్ మెహతాదే. అన్నీ కలుపుకుని ఏడాదికి రూ.14 కోట్లకు పైగా అందుకుంటారాయన. ఈ సంస్థలో ఇలా కోటికి పైగా వేతనం స్వీకరిస్తున్న ఉద్యోగుల్లో సగం మంది వయసు రీత్యా ముప్పైలలో వున్న వాళ్లేనని సంస్థ వార్షిక నివేదిక పేర్కొంది!

  • Loading...

More Telugu News