: రాజ్యసభలో సేమ్ సీన్...పునర్విభజన నాటి సీన్
రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన సందర్భంగా యావత్ తెలుగు జాతిని ఆకట్టుకున్న సీన్ మరోసారి పునరావృతమైంది. రాజ్యసభలో టీఆర్ఎస్, టీడీపీలు ఆందోళన నిర్వహించేటప్పుడు కాంగ్రెస్ నేతలు మౌనంగా బ్యానర్లు చేతబట్టి నిలబడే వారు. టీఆర్ఎస్, టీడీపీ నేతలు గొంతులు చించుకునేలా నినాదాలు చేసి అలసిపోయేవారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా కోసం రాజ్యసభ సభ్యులు కేవీపీ రామచంద్రరావు, జేడీ శీలం పోడియంలో బ్యానర్లు పట్టుకుని నిలబడ్డారు. 'మోదీ గేట్' అంశంపై రాజ్యసభ దద్దరిల్లుతున్నప్పుడు వీరిద్దరూ మౌనంగా బ్యానర్లు ప్రదర్శించడం విశేషం. ఈ సందర్భంగా డిప్యూటీ ఛైర్మన్ కురియన్ వారిని వారించారు.