: తెలంగాణ అమరవీరులకు బోర్నపల్లి వద్ద పిండప్రదానం


తెలంగాణ ఉద్యమంలో అసువులు బాసిన అమరవీరులకు ఈరోజు పిండప్రదానం చేశారు. కరీంనగర్ జిల్లా రాయికల్ మండలం బోర్నపల్లి వద్ద పుష్కరఘాట్ లో ఈ పిండప్రదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కవిత, పలువురు టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ అమరవీరుల త్యాగఫలమే తెలంగాణ అని, అమరవీరులు కూడా తమ కుటుంబసభ్యులేనని ఈ సందర్భంగా కవిత అన్నారు. ఇక పుష్కరాల విషయంలో లగడపాటి రాజగోపాల్ సీఎం కేసీఆర్ కు సర్టిఫికెట్ ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. వైఎస్ ఇంటి మనిషినని చెప్పుకునే జీవన్ రెడ్డి బోర్నపల్లికి వంతెన ఎందుకు తీసుకురాలేదని ఆమె ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News