: డిపాజిటర్లను మోసగించిన 'బొమ్మరిల్లు' ఆస్తుల జప్తు
విశాఖ కేంద్రంగా నడుస్తూ, వేలాది మంది అమాయకులను నట్టేట ముంచిన బొమ్మరిల్లు విల్లాస్ అండ్ ఫామ్స్ సంస్థ ఆస్తులను జప్తు చేస్తూ ఆంధ్రప్రదేశ్ హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అధిక వడ్డీలు ఇస్తామన్న ఆశ చూపించి డిపాజిటర్ల నుంచి వందల కోట్ల రూపాయలను దండుకున్న సంస్థ ఆపై వారిని మోసం చేసిన సంగతి తెలిసిందే. రంగారెడ్డి, నల్గొండ, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో బొమ్మరిల్లును నమ్మి పెట్టుబడిపెట్టిన వారు వేల సంఖ్యలోనే ఉన్నారు. అధిక వడ్డీల పేరుతో ఖాతాదారులను మోసగించిన నేరంలో సంస్థ యాజమాన్యం సీఐడీ విచారణను ఎదుర్కుంటోంది.