: ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో దేశం ముఖ్యనేతల కీలక భేటీ... గవర్నర్ వద్దకు తలసాని పంచాయతీ!
ఈ ఉదయం హైదరాబాదులోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో తెలుగుదేశం పార్టీ ముఖ్యనేతలు సమావేశమయ్యారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ రాజీనామా చేయకుండానే టీఆర్ఎస్ లో మంత్రి పదవి అనుభవిస్తున్నారని వార్తలు వచ్చిన నేపథ్యంలో తదుపరి తీసుకోవాల్సిన చర్యలపైనే వీరి మధ్య ప్రధానంగా చర్చ జరిగినట్టు తెలుస్తోంది. ఆయన రాజ్యాంగాన్ని అవమానపరిచారని అభిప్రాయపడ్డ నేతలు, ఈ సాయంత్రం 4 గంటలకు గవర్నరును కలసి తలసాని బర్తరఫ్ కు డిమాండ్ చేయాలని కూడా నిర్ణయించినట్టు సమాచారం. ఇప్పటికైనా గవర్నర్ స్పందించి కళ్లు తెరవాలని, టీడీపీ నుంచి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై వెంటనే వేటు వేయాలని వారు కోరనున్నారు.