: రాజ్యసభలో తొలిరోజే గందరగోళం... లలిత్ మోదీ అంశంపై చర్చకు కాంగ్రెస్ పట్టు


పార్లమెంటు వర్షాకాల సమావేశాల మొదటిరోజే రాజ్యసభలో తీవ్ర గందరగోళం ఏర్పడింది. సభ ప్రారంభమైన కొద్దిసేపటికే ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోదీ అంశంపై చర్చ చేపట్టాలంటూ కాంగ్రెస్ పట్టుబట్టింది. లలిత్ ను భారత్ కు రప్పించాలని కాంగ్రెస్ సభ్యుడు ఆనంద్ శర్మ డిమాండ్ చేశారు. లలిత్ అంశంపై కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ సహా ఇతర సభ్యులు సభలో ప్లకార్డులు ప్రదర్శించారు. ఇదే సమయంలో లలిత్ కు సహకరించారంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజస్థాన్ సీఎం వసుంధరా రాజే సింధియాను లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్ తీవ్ర విమర్శలు చేసింది. దాంతో మండిపడిన కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ, లలిత్ మోదీ అంశంపై చర్చకు సిద్ధమని ప్రకటించారు. విదేశాంగ శాఖ అన్ని ప్రశ్నలకు సమాధానం చెబుతుందన్నారు. అయితే ఈ విషయంపై చర్చించేందుకు కాంగ్రెస్ కూడా ముందుకు రావాలన్నారు. అయినప్పటికీ సభలో ప్రతిపక్షాల ఆందోళన కొనసాగుతుండటంతో ఉపసభాపతి కురియన్ అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వం చర్చకు అంగీకరించినా మీరెందుకు నిరసన చేస్తున్నారని అడిగారు. ఈ క్రమంలో సభను 12 గంటల వరకూ వాయిదా వేస్తున్నట్టు ఆయన ప్రకటించారు. మరోవైపు లోక్ సభ రేపటికి వాయిదాపడింది.

  • Loading...

More Telugu News