: పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఫలప్రదం అవుతాయని ఆశిస్తున్నా: మోదీ


పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఫలప్రదం అవుతాయని ఆశిస్తున్నానని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. సమావేశాలు సజావుగా సాగేందుకు విపక్షాలు సహకరించాలని ఆయన కోరారు. సరైన నిర్ణయాలు తీసుకోవడంలో ఎంపీలు తమ పాత్ర పోషిస్తారని ఆశిస్తున్నానని పేర్కొన్నారు. ఈ రోజు నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ఢిల్లీలో ప్రధాని మీడియాతో పైవిధంగా మాట్లాడారు. అంతేగాక మరికాసేపట్లో ఆయన ఎంపీలందరితో సమావేశం కానున్నారు.

  • Loading...

More Telugu News