: ఆందోళనలతో గడిచిన మొదటిరోజు.. లోక్ సభ రేపటికి వాయిదా


రెండో విడత పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన తొలిరోజు ఆందోళనలతో గడిచింది. దేశంలో సంచలనం సృష్టిస్తున్న ఢిల్లీ అత్యాచార బాలిక ఘటన, 2జీ, కోల్ స్కాంలు, మమతా బెనర్జీ దాడి అంశాలపై లోక్ సభ దద్దరిల్లింది. వీటిపై చర్చించేందుకు పలు విపక్షాలు డిమాండు చేయగా.. బీజేపీ ఏకంగా స్పీకర్ కు నోటీసు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని చేపట్టాలని చూసినప్పటికీ వీలు కుదరలేదు. దాంతో సభ రెండు సార్లు వాయిదాపడింది. అనంతరం మొదలైన సభలో సభ్యులు మళ్లీ తీవ్ర ఆందోళనకు దిగారు. దాంతో స్పీకర్ మీరాకుమార్ లోక్ సభ సమావేశాలను రేపటికి వాయిదా వేశారు. అటు రాజ్యసభలోనూ ఇదే తీరు కొనసాగుతోంది.

  • Loading...

More Telugu News