: రాత్రి 9 దాటితే యముడు తరుముతున్నాడు!


తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాదు నగరంలో ఏటేటా రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా రాత్రి 9 గంటల తరువాత యముడు తరుముకొస్తున్నాడు. ప్రమాదాలకు నిలయంగా మారిన గ్రేటర్ హైదరాబాదులో నిత్యమూ పాదచారులు రహదారి ప్రమాదాల్లో మృతి చెందుతున్నారని నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో (ఎన్సీఆర్బీ) తన తాజా నివేదికలో వెల్లడించింది. ఎన్సీఆర్బీ లెక్కల ప్రకారం, 2013తో పోలిస్తే, 2014లో ప్రమాదాల సంఖ్య 2,439 నుంచి 2,908కి పెరిగింది. ఇతర నగరాలతో పోలిస్తే ప్రమాదాల సంఖ్య హైదరాబాదులో తక్కువే అయినప్పటికీ, సంవత్సరం వ్యవధిలో దాదాపు 20 శాతం పెరగడం ఆందోళన కలిగిస్తోంది. కాగా, చెన్నైలో అత్యధికంగా 9,465 ప్రమాదాలు జరుగగా, ఢిల్లీలో 7,191, బెంగళూరులో 5,215, భోపాల్ లో 4,087 ప్రమాదాలు జరిగాయి. రాత్రి 9 గంటల తరువాత ర్యాష్ డ్రైవింగ్, ట్రాఫిక్ ఉల్లంఘనలే యాక్సిడెంట్లకు ప్రధాన కారణమని ఎన్సీఆర్బీ వివరించింది. పాదచారులు రోడ్లను దాటుతున్నప్పుడు ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపింది. ఇక నెలల వారీగా ప్రమాదాలు పరిశీలిస్తే న్యూ ఇయర్ వేడుకలు జరుపుకునే డిసెంబర్ ప్రమాదాల విషయంలో ముందు నిలిచింది. డిసెంబర్ నెలలో 515 ప్రమాదాలు జరుగగా, అక్టోబర్ లో 235 ప్రమాదాలు జరిగాయి. 30 నుంచి 45 సంవత్సరాల వయసున్న వారు యాక్సిడెంట్లలో అత్యధికంగా మరణిస్తున్నారని ప్రకటించింది.

  • Loading...

More Telugu News