: రూ. 5 వేల కోట్లున్నా, వ్యాన్ లో నివసిస్తున్న యువ పారిశ్రామికవేత్త


అమెరికాలోని ప్రముఖ నగరం లాస్ వెగాస్ లో టోనీ గ్సీ ఉత్తమ యువ పారిశ్రామికవేత్త. ఆయనకు రూ. 5,000 కోట్లకు పైగా ఆస్తులున్నాయి. తైవాన్ సంతతికి చెందిన అమెరికా పౌరుడు టోనీ గ్సీ. ఇటీవలి కాలం వరకూ ఆన్ లైన్ మాధ్యమంగా దుస్తులు, చెప్పులు విక్రయించే జప్పోస్ సంస్థకు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. దాన్ని రూ. 750 కోట్లకు అమెజాన్ డాట్ కామ్ కు విక్రయించాడు. అందులో కొంత భాగాన్ని స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టి, మిగతాది స్థిరాస్తి వ్యాపారంలో పెట్టి వృద్ధి చేశాడు. కోరుకుంటే, విలాసవంతమైన భవనాన్ని, సకల సౌకర్యాలను క్షణాల్లో సమకూర్చుకోగల ఆయన నివాసం ఎక్కడో తెలుసా? ఇక్కడి ట్రేలర్ పార్క్ లో సుమారు రూ. 30 లక్షలు విలువైన ఓ కారవాన్ వ్యాన్. చిన్న కిచెన్, రెండు సోఫాలు, డైనింగ్ టేబుల్, వాష్ రూం తదితరాలు ఉండే ఈ వ్యాన్ ను అదే పార్కులో ఉంచి అందులోనే నిరాడంబరంగా జీవిస్తుంటాడు. అంతేకాదు, తన పార్కింగ్ స్థలంలో తక్కువ అద్దెకు మరో 30 కారవాన్ వ్యాన్లు పార్క్ చేసుకునే సౌకర్యాన్ని కల్పించాడు. ఇక్కడి వ్యాన్లలో ఉండేవారంతా కంప్యూటర్ ప్రోగ్రామర్లే. తాను సంపాదించిన డబ్బును స్టాక్స్, రియల్ ఎస్టేట్ రంగాల్లో పెట్టి విజయం సాధించాడు. లాస్ వెగాస్ నగరాన్ని వ్యాపారపరంగా అత్యున్నత స్థాయికి తీసుకువెళ్లడమే తన లక్ష్యమని చెబుతుంటాడు.

  • Loading...

More Telugu News