: మరో జన్మ ఉంటే గోదారి ఒడ్డునే పుడతానంటున్న జయప్రద!


మరో జన్మ అంటూ ఉంటే గోదావరి ఒడ్డున పుడతానని ప్రముఖ నటి, మాజీ ఎంపీ జయప్రద అన్నారు. నిన్న తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి వచ్చిన ఆమె అక్కడి వీఐపీ ఘాట్ లో పుష్కర స్నానమాచరించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ పుష్కరాల ఏర్పాట్లు అద్భుతంగా ఉన్నాయని ఆమె పేర్కొన్నారు. మరో జన్మ అంటూ ఉంటే, పవిత్ర గోదావరి ఒడ్డున పుడతానని ఆమె వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News