: కొచ్చి విమానాశ్రయంలో భారీ ఎత్తున డ్రగ్స్ స్వాధీనం!


కేరళలోని కొచ్చి విమానాశ్రయంలో భారీ ఎత్తున మత్తు పదార్థాలు పట్టుబడ్డాయి. దక్షిణాఫ్రికాకు చెందిన ఓ మహిళ కొచ్చి నుంచి దోహా వెళుతుండగా అనుమానంతో కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు. ఆమె వద్ద భారీ స్థాయిలో డ్రగ్స్ ను కనుగొన్నారు. వెంటనే మహిళను అదపులోకి తీసుకున్న అధికారులు డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ రూ.20 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేశారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

  • Loading...

More Telugu News