: రెండేళ్ల కనిష్ఠానికి చేరిన పసిడి ధర
బంగారం ధరలు దిగువకు చేరుతున్నాయి. ఈ రోజు పసిడి ధర రెండు సంవత్సరాల కనిష్ఠస్థాయికి చేరింది. ఈ నేపథ్యంలో రూ.300 తగ్గడంతో బులియన్ మార్కెట్ లో 10 గ్రాముల బంగారం ధర రూ.25,700కు చేరింది. ప్రపంచ మార్కెట్లు బలహీనమవడం, నగల వ్యాపారులు, రిటైలర్లు బంగారం కొనుగోళ్లు చేపట్టకపోవడంతో డిమాండ్ తగ్గింది. అటు వెండి కూడా రూ.150 తగ్గింది. దాంతో కేజీ ధర రూ.34,200 పలుకుతోంది. నాణేల తయారీదారులు కూడా కొనుగోళ్లు చేపట్టకపోవడంతో వెండి డిమాండ్ తగ్గి ధరలు దిగివచ్చాయని మార్కెట్ వర్గాలు అంటున్నాయి.